జ్ఞాపకం

నువ్వు జీవితమని పిలిచే ఈ చిన్న అనుభవం…
చరిత్రలో కొన్ని కోట్ల సార్లు పునరావృతమై ఉంటుంది:

రాలిన గులాబి మొగ్గ నీకొక విషాద గాధ – నిరుడు కురిసిన హిమసమూహం కరిగిపోతే గుండెకోత.
కానీ… కాలం హృదయం లేనిది: అలరించిన ప్రతి వసంతాన్నీ అలవోకగా సాగనంపుతుంది!

వీడ్కోలుగా ఆకాశం రెండు కన్నీటి చుక్కలు విడుస్తుంది,
కాలం మరో వసంతానికై పరుగు తీస్తూ పోతుంది!

అయినా ఎన్ని వసంతాలు రాలేదూ…
కరిగిపోయిన హిమసమూహం ఆ సింధువులో ఒక బిందువు!
రాలిన గులాబి మొగ్గ ఒక లెక్కా?

నిరుటి మేఘం చల్లిన కళ్ళాపి జల్లు తడి పై,
నవోదయపుటరుణకిరణాల ముగ్గులు పుస్తాయ్…
అయినా నీ రెండు కళ్ళూ… ఎందుకో, తడి జాడల్నేతడుముతూ ఉంటాయ్!
జీవితపుటెడారుల్లో జ్ఞాపకాల ఇసుక రేణువుల్ని వెదుకుతాయ్…

మరణాన్ని సమాధి చేసి, మర్త్యత్వపు సరిహద్దుల ఆవల… అవధుల్లేని జీవప్రవాహంగా…
నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయ్!

ఆనందం

సమాజధర్మాల్ని మనిషి నిర్ణయిస్తే,
శరీరధర్మాల్ని ప్రకృతి నిర్ణయించింది.
ప్రకృతి సంకల్పానికి ఎదురీదటం సాధ్యమా?

అయినా బుధ్ధి మనసుని ప్రతిఘటించింది,
మనస్పూర్తిగా ప్రతిఘటించిందా? సందేహమే?

నిగ్రహం ఆవేశంతో తలపడే కొన్ని క్షణాల్లో…
ఓటమి విజయాన్ని మించిన ఆనందాన్నిస్తుంది!
అందుకనే విజయాన్ని కాదని ఓటమిని అక్కున చేర్చుకున్నామేమో
రాజు లొంగిపోయాక రాజ్యంలాగే… మనసు లొంగిపోయాక తనువూ.

నీటిలోకి రాయి విసిరినంత నిర్లక్ష్యంగానే…
ఓరకంటి చూపు విసిరావు…
రాయి అలజడి రేపింది,
చూపు కలవరం రేపింది–
మానససరోవరంలో నిశ్శబ్దంగానే మౌనభంగం జరిగింది!

నిశ్శబ్దం మౌనమేనా… నీకళ్ళు నా కళ్ళకు బదులివ్వలేదా?
వెలుగుచినుకుల వాన కితకితలెడితే గోదారి తైతెక్కలాడలేదా?
చేయందించి నువ్వు పడవలోకి లాగావా, చేతినందుకుని నేను లోపలికొచ్చానా?
మబ్బు చాటునుంచి చూసిన చందమామ నడగాలి!

పండు వెన్నెలా, గండు కోయిలా,
వరద గోదారీ, వెలుగు రాదారీ,
వానవిల్లూ, వెన్నెల సెలయేరూ…
అన్నీ ఒక్క సారే… ఒక్క చోటే…

పోటెత్తిన సంద్రం ఒడ్డుని ముంచెత్తినట్టు,
అవధుల్లేని ఆనందం ఆత్మను ముంచెత్తినపుడు…
ఆనందం చైతన్యాన్నీ, అంతరంగాన్నీ దాటి ప్రాణాన్ని మృదువుగా స్పృశించినపుడు…

ఆ జ్ఙాపకం సైతం ఆనందమై అద్వైతాన్ని ఆవిష్కరించదా?
నువు లేని క్షణంలోనూ నీ ఉనికిని ప్రకటించదా…?

Linux Mint 11 (Katya) లో తెలుగు

నేను Linux Mint 11 (Katya) వాడుతున్నాను. ఇది Ubuntu 11.04 (Natty Narhwal) ఆధారిత ఆపరేటింగ్ సిస్టం. ఈ రెండింటిలోనూ SCIM, i-Bus లకు ఉద్వాసన పలికి ఏదో కొత్త input method ని ప్రవేశపెట్టారు. తెలుగు inscript keyboard layout లో టైప్ చెయ్యటం తెలిసిన వారికి ఈ కొత్త method తో ఎలాంటి చిక్కులూ‌ఉండవు. కాని ఇంగ్లీషులో టైప్ చేసి లిప్యంతరీకరణ (transliteration) మీద ఆధారపడే నాలాంటి వాళ్ళకు అనుకూలమయిన Telugu-RTS, Telugu-Phonetic, Telugu-iTrans లాంటి కీబోర్డ్ layout లు యిక్కడ లేవు. అందువల్ల నేను తిరిగి SCIM install చేసుకోవల్సి వచ్చింది. నాలా యింకా ఎవరయినా కష్టపడుతుంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ ప్రక్రియను ఇక్కడ రాస్తున్నాను. ముందుగా:‌
అ) SCIM ని ఇన్‌స్టాల్ చేయుట:
  1. మొదట టెర్మినల్ తెరిచి sudo apt-get install scim scim-m17n scim-gtk2-immodule అని టైప్ చేసి Enter కొట్టండి.
  2. sudo కి మీపాస్‍వర్డ్ చెప్పండి. అప్పుడు apt ఆ ప్యాకేజిల సైజ్ చూపించి ఇన్‌స్టాల్ చెయ్యాలా వద్దా అని అడుగుతుంది. “Y” ఎంటర్ చేసి దానిని పనిచూస్కొమ్మనండి.
  3. కనెక్షన్ స్పీడ్ ని బట్టి ఐదు నిమిషాల్నుంచి అరగంటలోపు SCIM మీ కంప్యూటర్ లో సెటిలవుతుంది. ఇప్పుడు దాన్ని పనిచే యించడమే తరువాయి.

ఆ) SCIM ని చలనశీలము (Activate)చేయుట

  • టెర్మినల్ లో మీరున్న చోటే im-switch -s scim అని టైప్ చేసి Enter నొక్కండి. ఇంకొక్క పని మాత్రం మిగిలింది: SCIM ని మీకు కావల్సినట్టు శ్రుతి చేసుకోవటం.

ఇ) SCIM ని శృతి చేయుట:‌ 

  • Alt-F2 కలిపి నొక్కితే, Run Dialog Box వస్తుంది. అందులో scim-setup అని టైప్ చేసి Enter కొడితే చిత్రంలో ఉన్న dialog వస్తుంది.

అందులో కనిపిస్తున్నట్టుగా, IMEngine లో Global Setup పై క్లిక్ చేసి కుడి వైపు మీకు వచ్చిన/నచ్చిన అన్ని భాషల్నీ వాటిలో మీరు టైప్ చెయ్యగల్గిన keyboard layouts నీ‌ఎంచుకుని OK కొట్టండి.

ఇక చెలరేగిపోండి. ఆంగ్లేతర భాషలో రాయాలనిపించిన ప్రతిసారీ, కుడి వైపు మూలన కనిపిస్తున్న చిట్టా లోంచి ఒక input method ని ఎంచుకుని రాసిపడెయ్యండి.

హెచ్చరికతో కూడిన గమనిక:‌ నా Linux Mint 11 లో ఈ పధ్ధతి పని చేసింది. ఇతర Ubuntu ఆధారిత distro ల్లో కూడా పని చేస్తుందని అనుకుంటున్నాను.ఒక వేళ పని చేయకపోతే… రావు గారూ… నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి.

మనవి:‌ ఈ పధ్ధతి మీ డిస్ట్రో లో పని చేస్తే వ్యాఖ్యానాల్లో తెలియజేయండి.

Simulation: Motion In 2D

This GeoGebra Applet lets you simulate Motion in 2D by changing different parameters. If you have GeoGebra 4.0 (Beta) installed on your machine, you can double click the simulation to open it in a GeoGebra window.
Sorry, the GeoGebra Applet could not be started. Please make sure that Java 1.4.2 (or later) is installed and active in your browser (Click here to install Java now)

Centripetal and Centrifugal Forces

  1. Centripetal force is the cause of change in direction (and hence motion in a circle).
    Centrifugal force is an effect of that change in direction (we called it inertia of direction in class 8th)
  2. Centripetal force is a real force (there is a pull, push, attraction, repulsion by some agent).
    Centrifugal force is fictitious (show me who is doing the pushing etc.?)
  3. Centripetal force acts radially inwards (towards the center of curvature).
    Centrifugal force acts radially outwards (towards the curvature, from the center)
  4. Centripetal force exists in both inertial and non-inertial frames of reference.
    Centrifugal appears only in a rotating frame (a special non-inertial frame) of reference. 
  5. At any given instant, both centripetal and centrifugal forces have the same magnitude given by the formula F = mv2/r = mrw2
  6. The magnitude of the two forces remains unchanged in a uniform circular motion.
  7. The two forces do not form an action-reaction pair. Their magnitudes are equal and directions are opposite, but they act on the same body. Also, the centrifugal force disappears as soon as the observer shifts into an inertial frame of reference. 
Follow

Get every new post delivered to your Inbox.