అ) SCIM ని ఇన్‌స్టాల్ చేయుట:
- మొదట టెర్మినల్ తెరిచి sudo apt-get install scim scim-m17n scim-gtk2-immodule అని టైప్ చేసి Enter కొట్టండి.
- sudo కి మీపాస్‍వర్డ్ చెప్పండి. అప్పుడు apt ఆ ప్యాకేజిల సైజ్ చూపించి ఇన్‌స్టాల్ చెయ్యాలా వద్దా అని అడుగుతుంది. “Y” ఎంటర్ చేసి దానిని పనిచూస్కొమ్మనండి.
- కనెక్షన్ స్పీడ్ ని బట్టి ఐదు నిమిషాల్నుంచి అరగంటలోపు SCIM మీ కంప్యూటర్ లో సెటిలవుతుంది. ఇప్పుడు దాన్ని పనిచే యించడమే తరువాయి.
ఆ) SCIM ని చలనశీలము (Activate)చేయుట
- టెర్మినల్ లో మీరున్న చోటే im-switch -s scim అని టైప్ చేసి Enter నొక్కండి. ఇంకొక్క పని మాత్రం మిగిలింది: SCIM ని మీకు కావల్సినట్టు శ్రుతి చేసుకోవటం.
ఇ) SCIM ని శృతి చేయుట:
- Alt-F2 కలిపి నొక్కితే, Run Dialog Box వస్తుంది. అందులో scim-setup అని టైప్ చేసి Enter కొడితే చిత్రంలో ఉన్న dialog వస్తుంది.
అందులో కనిపిస్తున్నట్టుగా, IMEngine లో Global Setup పై క్లిక్ చేసి కుడి వైపు మీకు వచ్చిన/నచ్చిన అన్ని భాషల్నీ వాటిలో మీరు టైప్ చెయ్యగల్గిన keyboard layouts నీఎంచుకుని OK కొట్టండి.
ఇక చెలరేగిపోండి. ఆంగ్లేతర భాషలో రాయాలనిపించిన ప్రతిసారీ, కుడి వైపు మూలన కనిపిస్తున్న చిట్టా లోంచి ఒక input method ని ఎంచుకుని రాసిపడెయ్యండి.
హెచ్చరికతో కూడిన గమనిక: నా Linux Mint 11 లో ఈ పధ్ధతి పని చేసింది. ఇతర Ubuntu ఆధారిత distro ల్లో కూడా పని చేస్తుందని అనుకుంటున్నాను.ఒక వేళ పని చేయకపోతే… రావు గారూ… నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి.
మనవి: ఈ పధ్ధతి మీ డిస్ట్రో లో పని చేస్తే వ్యాఖ్యానాల్లో తెలియజేయండి.
